రాష్ట్రంలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం: కూటమి సర్కార్ కీలక ప్రాజెక్టులు

రిపోర్టర్: సురేష్ స్థలం: Amaravati

రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన కొద్ది రోజుల్లో రూ.2.12 లక్షల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని అధికారులు తెలిపారు. పల్లెపండుగ 3.0, పేదలకు పట్టాభిషేకం, జలజీవన్ మిషన్ 2.0 వంటి కార్యక్రమాల ద్వారా మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ ప్రగతి బాటలో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.