గిరిజనులకు సాధికారత కల్పించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

సంస్థాన్ నారాయణపురం మండలంలోని మర్రిబావి తండాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి నాయకులు, మహిళలు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరంటోత్ జగ్రామ్ నాయక్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తండా పార్టీ నాయకులు, యువకులు మరియు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కృతజ్ఞతలు తెలిపారు.