ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్: పెన్షన్ పెంపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: గోపి స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. జనవరి 2027 నుంచి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను మెరుగుపరిచి, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ. 2,880 కోట్ల అదనపు భారం పడనుంది. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది.