కేజీబీవీ విద్యార్థినుల జడలు కత్తిరించిన అగంతకులు

రిపోర్టర్: హరి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తీవ్ర కలకలం రేగింది. రాత్రి సమయంలో నిద్రపోతున్న పది మంది తొమ్మిదో తరగతి బాలికల జడలను అగంతకులు కత్తిరించారు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేపట్టారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి తగిన చర్యలకు ఆదేశించారు.