ఉపాధ్యాయులపై వైకాపా నేతల దాడిని తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

విజయవాడలో స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైకాపా నేతలు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. గురువులపై రౌడీలతో దాడులు చేయిస్తే చూస్తూ ఊరుకోమని, రౌడీయిజం చేసేవారి తోక కత్తిరిస్తామని ఆయన హెచ్చరించారు. ఫేక్ పార్టీ అందరినీ ఫేక్ అంటే సహించేది లేదని స్పష్టం చేస్తూ, చట్టబద్ధంగా వెళ్లకుండా దాడులకు దిగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.