నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘనంగా ఆవిష్కరించారు. గడిచిన యాభై ఏళ్లలో యూనివర్సిటీ సాధించిన విజయాలు, ఉన్నత విద్యారంగానికి అందించిన సేవలను అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.