గుర్గావ్‌లో మహిళా బైకర్‌ను ఢీకొట్టి, ఈడ్చుకెళ్లిన కారు

రిపోర్టర్: మహేష్ స్థలం: హర్యానా

గుర్గావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఓ కారు మహిళా బైకర్ సియాను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆమె కిందపడగా, బైక్‌ను కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. నిందితులు పరారయ్యారు. తనను వేధించారని, మందు తాగి వెంబడించారని బాధితురాలు ఆరోపించింది. యాక్షన్ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.