కార్మిక సంక్షేమ నిధులను ప్రచారానికి మళ్లించడంపై విపక్షాల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి ప్రచార ఆర్భాటాల కోసం కోట్లాది రూపాయల నిధులను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి నిధుల నుంచి ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించగా, తాజాగా ఈఎస్ఐ నిధుల నుంచి మరో పదకొండర కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం వైద్య సేవలకు కేటాయించిన నిధులను ప్రచారానికి మళ్లించడంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.