కల్లూరులో వరుస దొంగతనాల ముఠా అరెస్ట్.. 13 లక్షల సొత్తు స్వాధీనం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కల్లూరు

కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పులిచెర్ల రైల్వే స్టేషన్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 13 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు రొంపిచెర్ల మండలం దద్దాలవారిపల్లికి చెందిన ఆవులకుంట నరేష్, తిరుపతికి చెందిన పిన్న బోయున శ్రీనివాసులుగా గుర్తించారు. వీరు పలు ఆలయాలు, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి జల్సాలు చేసేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులను పట్టుకున్న పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు.