బీసీలను మోసం చేసిన గత వైకాపా తీరును నమ్మరు: మంత్రి కొల్లు రవీంద్ర
రిపోర్టర్: నరేష్
స్థలం: కృష్ణా
గత ప్రభుత్వ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని, ఎన్ని కబుర్లు చెప్పినా బీసీ వర్గాలు వారి మాటలను నమ్మబోవని గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, వారి అభ్యున్నతి కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.