వైఎస్ వివేకా హత్య కేసు: వైఎస్ భాస్కరరెడ్డికి ఈడీ కీలక నోటీసులు
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డికి సోమవారం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. ఈ హత్యకు కుట్ర పన్నడంతో పాటు ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీయనున్నారు.