స్లో ఓవర్ రేట్ కారణంగా శ్రీలంక జట్టుకు జరిమానా విధించిన ఐసీసీ
రిపోర్టర్: విజయ్
స్థలం: చెస్టర్-లీ-స్ట్రీట్
ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు శ్రీలంక జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ప్రకటించారు. శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ తప్పును అంగీకరించడంతో విచారణ లేకుండానే ఈ శిక్షను ఖరారు చేశారు. ఈ మ్యాచ్లో శ్రీలంక 89 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.