పార్లమెంట్ లో చర్చకు రావాలంటూ రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన చర్చ సవాల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. పార్లమెంట్ లో చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు సిద్ధమని అమిత్ షా ప్రకటించినా రాహుల్ గాంధీ స్పందించకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసిరే రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతగా పార్లమెంట్ కు వచ్చి సమాధానాలు వినాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే సభలో చర్చలో పాల్గొనాలని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.