అస్సాంలో కాంగ్రెస్ కాన్వాయ్ పై దాడి రాజకీయ కుట్రేనని నేతల ఆరోపణలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అస్సాం

అస్సాం రాష్ట్రం నాగావ్ జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కాన్వాయ్ పై రాళ్ల దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. బర్మాలో జరిగే బహిరంగ సభకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల వాహనాలపై జరిగిన ఈ దాడిపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పరస్పర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల వల్లే ఈ ఘర్షణ జరిగిందని సీఎం శర్మ స్పష్టం చేయగా, బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని వేణుగోపాల్ తీవ్రంగా మండిపడ్డారు.