బీహార్‌లో మైనర్ బాలిక వేధింపుల ఘటనపై కేసు నమోదు
రిపోర్టర్: మహేష్
స్థలం: Banka
బీహార్ రాష్ట్రం బంకా జిల్లాలోని మందార్ పర్వత్ పర్యాటక ప్రాంతంలో ఓ మైనర్ బాలికను దుండగులు బహిరంగంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బౌన్సీ పోలీసులు సుమోటోగా స్పందించి ఆరుగురు గుర్తు తెలియని యువకులపై కేసు నమోదు చేశారు. ఇలాంటి అసాఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.