ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 2న తెల్లకాగితం సినిమా విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: Andhra Pradesh / Telangana
అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెల్లకాగితం సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ట్రాక్ టాలీవుడ్ వెల్లడించింది. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రమేష్ బాండ్రెడ్డి దర్శకత్వం వహించారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువ నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.