కొండా సురేఖను బీఆర్ఎస్‌లోకి రానివ్వం: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కొండా సురేఖను ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌లోకి రానివ్వమని, తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా పార్టీలోకి తీసుకోమని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.