కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి చెప్పే సమయం వచ్చింది: ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పేర్కొన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రభుత్వ మోసాలను తిప్పికట్టేందుకు పట్టభద్రులందరూ తక్షణమే ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు.