అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్పై కీలక నిర్ణయం: కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిల నిర్మకం

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్లో భాగంగా కృష్ణానదిపై అత్యాధునిక ఐకానిక్ కేబుల్ వంతెనల నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపిందని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ ప్రాజెక్ట్ రీ-డిజైనింగ్ చేపట్టినట్లు వారు తెలిపారు. గతంలో సాధారణ వంతెనలు నిర్మించాలని భావించినా, రాజధాని నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఈ కేబుల్ బ్రిడ్జిలను మూడు లైన్లతో రెండుచోట్ల నిర్మించనున్నట్లు సమాచారం అందించారు.