ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానున్న పూజా మేరీ జాన్
రిపోర్టర్: రాము
స్థలం: ముంబై
బాలీవుడ్ నటిమణులు హూమా ఖురేషి, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'పూజా మేరీ జాన్'. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 2న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.