వైభవంగా మలయాళ నటి అహనా కృష్ణ వివాహం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Kerala
ప్రముఖ మలయాళ నటి అహనా కృష్ణ, సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి వివాహం సెప్టెంబర్ 13న ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నటి అధికారికంగా ప్రకటించారు. గత పదేళ్లుగా స్నేహితులుగా ఉన్న తాము పెద్దల సమక్షంలో ఒక్కటయ్యామని ఆమె తెలిపారు. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను అభినందించారు.