స్థానిక పోరులో ఆసక్తికర పోరు: బంధువులే ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన వైనం
రిపోర్టర్: వెంకట్
స్థలం: వెంకటాచలం
మండల ప్రాదేశిక ఎన్నికల్లో ఆసక్తికర పోటీలు నెలకొంటున్నాయని, పలు ప్రాంతాల్లో బంధువులే ప్రత్యర్థులుగా మారారని వెంకటాచలం మండల వర్గాలు వెల్లడించాయి. వెంకటాచలం మండలంలోని ఈపూరు బిట్-2 ఎంపీటీసీ స్థానానికి వరుసకు అత్తా కోడళ్లు అయిన స్నేహలతారెడ్డి, పవిత్రరెడ్డి పోటీపడుతుండగా, మరో స్థానంలో తోడికోడళ్లు బరిలో నిలిచారు. అలాగే మరో చోట పాత ప్రత్యర్థులే మళ్లీ తలపడుతుండటంతో ఈ ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయని అధికారులు తెలిపారు.