స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల జోరు: సెన్సెక్స్ 750 పాయింట్లు జంప్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోందని ఎక్స్ఛేంజ్ వర్గాలు వెల్లడించాయి. కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలు, దిగివస్తున్న చమురు ధరలతో మంగళవారం నాటి సెషన్ లో సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 750 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 23,600 మార్క్ దాటింది. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.4 లక్షల కోట్లకుపైగా పెరిగి రూ.486 లక్షల కోట్లకు చేరింది. ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్ లో కొనసాగాయి.