దిల్లీలో జంతర్ మంతర్ నిరసనల కలకలం: నేతల అరెస్ట్

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

దిల్లీలో ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని సీజేపీ వ్యవస్థాపకులు అభిజిత్ దిప్కే తెలిపారు. ఈ నిరసన నేపథ్యంలో దిల్లీ పోలీసులు సుమారు మూడు వేల మందిని అదుపులోకి తీసుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్తో పాటు ప్రత్యేక సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.