గ్రామీణ వైద్య సేవలకు పెద్దపీట: అమలకుడియలో హెల్త్ క్లినిక్ ప్రారంభం

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం అమలకుడియ గ్రామంలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో ముప్పై ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు స్థానికంగా అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా ఈ నూతన ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.