బండి భగీరథ్ కేసులో హైకోర్టు సంచలన ఉత్తర్వులు: మీడియా ట్రయల్స్పై నిషేధం

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

బండి భగీరథ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించి ఎలాంటి కొత్త కంటెంట్ను ప్రచురించవద్దని టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వినియోగదారులను కోర్టు స్పష్టంగా ఆదేశించింది. మీడియా ట్రయల్స్ నిర్వహించడం, దర్యాప్తు సమాచారం లీక్ చేయడంపై ఆంక్షలు విధించింది. బాధితురాలి గుర్తింపు వెల్లడయ్యేలా ప్రచారం చేయరాదని, మార్ఫింగ్ ఫొటోలు, కృత్రిమ మేధస్సు చిత్రాలు షేర్ చేయకూడదని తేల్చిచెప్పింది.