పెదగొండిలో ఘనంగా అడవి తల్లి బాట: మౌలిక వసతులపై టీడీపీ నాయకుల సమీక్ష
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదగొండి
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పెద్దకోడపల్లి పంచాయతీ పరిధిలోని పెదగొండి గ్రామంలో అడవి తల్లి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్చార్జ్, యూనిట్ ఇన్చార్జ్, మాజీ ఎంపీటీసీ మరియు ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా చర్చించారు.