లోనావాలలో రూ.70 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్.
రిపోర్టర్: సతీష్
స్థలం: மகாராஷ்டிரா
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మహారాష్ట్రలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన లోనావాలలో రూ.70 కోట్ల భారీ వ్యయంతో 3.86 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మావల్ తాలూకా పరిధిలో మూడు వేర్వేరు డీడ్ల ద్వారా ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. ఇందులో ఒక అతిపెద్ద ప్లాట్‌పై పూర్తి యాజమాన్యం ఉండగా, మిగిలిన భాగాలపై 50 శాతం వాటా కలిగి ఉన్నారు.