ఓపెన్ ఏఐలో బగ్ గుర్తించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోహన్ శ్రీరామకృష్ణ

రిపోర్టర్: నరేష్ స్థలం: తూర్పుగోదావరి

ఓపెన్ ఏఐలో భద్రతా లోపాన్ని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా అరుదైన గుర్తింపు సాధించానని టెక్కీ మోహన్ శ్రీరామకృష్ణ పెదపాటి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలానికి చెందిన ఆయన, సాధారణ తెలుగు మీడియం పాఠశాలలో చదివి ఎథికల్ హ్యాకింగ్లో పట్టు సాధించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల్లో బగ్లను కనిపెట్టి ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీ కేంద్రంగా హ్యాక్ట్రాన్ ఏఐ సంస్థను ప్రారంభిస్తున్నట్లు మోహన్ శ్రీరామకృష్ణ వెల్లడించారు.