ఆన్లైన్ లాటరీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: వెంకట్ స్థలం: అల్లూరి సీతారామరాజు

సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఆన్లైన్ లాటరీ మరియు బహుమతి ప్రకటనల పట్ల తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు వెల్లడించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి మాధ్యమాలలో పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకున్నారంటూ వచ్చే నకిలీ ప్రకటనలను ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు, జీఎస్టీ పేరుతో ఎవరికీ డబ్బులు ముందస్తుగా పంపవద్దని, బ్యాంక్ వివరాలు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైన బాధితులు వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.