అమృత్సర్లో దారుణం: ఆప్ సర్పంచ్ సోదరుడి కాల్చివేతతో పంజాబ్లో కలకలం

రిపోర్టర్: నరేష్ స్థలం: Amritsar

అమృత్సర్ జిల్లాలోని చీతే కలాన్ గ్రామంలో గురువారం గురుద్వారా వెలుపల ఆప్ సర్పంచ్ సోదరుడు తీరత్ సింగ్ను దుండగులు కాల్చి చంపినట్లు అత్తారి డీఎస్పీ యాద్విందర్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనలో మృతుడి స్నేహితుడు రంజిత్ సింగ్ గాయపడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. పాత కక్షలు, భూ వివాదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, నలుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు స్పష్టం చేశారు.