విజయవాడ బెంగుళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనులు వేగవంతం

రిపోర్టర్: రాము స్థలం: ప్రకాశం

విజయవాడ నుంచి బెంగుళూరు వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనులు శరవేగంగా సాగుతున్నట్లు మేఘా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కనిగిరి మండలం వంగపాడు వద్ద నిర్మిస్తున్న ట్విన్ టన్నెల్స్ పనులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం ఆరు గంటలకు తగ్గనుండటంతో పాటు కనిగిరి ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు పేర్కొన్నారు.