'ప్రతిభ చాటిన అధికారులకు అభినందనలు': కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ రివార్డుల అందజేత

రిపోర్టర్: సతీష్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లాలో నాలుగు చోరీ కేసులను సమర్థవంతంగా ఛేదించిన పోలీసు బృందాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ఆయన రివార్డులు అందజేసి వారి సేవలను కొనియాడారు. ఇలాంటి ఘటనలు పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచుతాయని, నేరాలను అణచివేయడంలో సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.