మట్టి విగ్రహాల పంపిణీతో అరుదైన గుర్తింపు తెచ్చుకున్న నిర్వాహకులు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ షాప్ నిర్వాహకులు నంగునూరు సోమయ్య రాజు సోదరులు వినాయక చవితి సందర్భంగా ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో వారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను కలవగా, ఆయన వారి సేవలను ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో జరిగే ఉత్సవాల వివరాలను సీపీ తెలుసుకుని నిర్వాహకులని ప్రశంసించారు.