కూటమి ప్రభుత్వ మద్యం విధానంపై వైఎస్సార్‌సీపీ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Andhra Pradesh

రాష్ట్రంలో లిక్కర్ నెట్‌వర్క్ చాలా దారుణంగా ఉందని వైఎస్సార్‌సీపీ మండిపడింది. టీడీపీకి కావాల్సిన వారికే లిక్కర్ షాపులు కట్టబెట్టి, ఇష్టారీతిన బెల్ట్‌షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చే డబ్బు అంతా కరకట్టకి చేరుతోందని, ప్రస్తుతం రాష్ట్రంలో క్యాష్, సూట్‌కేస్, రాజేష్, లోకేష్ అనే నినాదం నడుస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.