సిద్దిపేటలో భయపడి తిరగాల్సిన అవసరమేముందంటూ హరీశ్ రావు ఎద్దేవా
రిపోర్టర్: హరి
స్థలం: Siddipet
సిద్దిపేట పర్యటనకు భారీ కాన్వాయ్, బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, డ్రోన్ కెమెరాలు ఎందుకు వాడుతున్నారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తాను ఇక్కడే ఉన్నానని, తనకు చెబితే కడుపు నిండా భోజనం పెట్టి తోటంతా చూపిస్తానని ఎద్దేవా చేశారు. అంత మంది పోలీసులను పెట్టుకుని భయపడుకుంటూ రావాల్సిన అవసరం ఏముందని ఆయన ఘాటుగా నిలదీశారు.