కొల్లాపూర్ లో పర్యాటకాభివృద్ధి పనులు: రూ.57.63 కోట్లతో ముమ్మరంగా ఏర్పాట్లు

రిపోర్టర్: శివ స్థలం: కొల్లాపూర్

కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా సుమారు యాభై ఏడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణానది తీరం మరియు సోమశిల లలితాసోమేశ్వర ఆలయ ప్రాంగణంలో రూరల్ టూరిజం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాయి. సోమశిల ఐలాండ్, కాటేజీలు, బోటింగ్ ఏర్పాట్లను జూన్ నాటికి పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.