రాజాంలో దివ్యాంగులకు మూడుచక్రాల వాహనాల పంపిణీ: ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
దివ్యాంగుల సంక్షేమం, వారి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ స్పష్టం చేశారు. రాజాం తెదేపా కార్యాలయం వద్ద శుక్రవారం అర్హులైన ఆరుగురు దివ్యాంగులకు మొదటి విడతలో భాగంగా మూడుచక్రాల వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల పింఛన్‌ను ఆరు వేలకు పెంచామని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని ఆయన వెల్లడించారు.