డ్రగ్స్ నివారణే లక్ష్యంగా విస్తృతంగా ఆపరేషన్ త్రిశూల్ అవగాహన
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టి మహిళలు బాలికలకు భద్రత కల్పించడంతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పోలీసులు ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోడూరు రూరల్ సర్కిల్ పరిధిలోని పలు మండలాల్లో ప్రధాన కూడళ్ల వద్ద పోస్టర్లు ఏర్పాటు చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని సీఐ కోరారు.