ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారంటూ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

ముస్లింలకు అర్థవంతమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మైనారిటీలను సమాన రాజకీయ భాగస్వాములుగా చూడకుండా కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని ధ్వజమెత్తారు. నెహ్రూ కాలం నుంచి ఇప్పటివరకు అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు ముస్లింల రాజకీయ అణచివేతకు కారణమయ్యాయని, పార్లమెంట్లో కేవలం నాలుగు శాతం ప్రాతినిధ్యం ఉండటం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.