వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి దుర్మార్గమన్న కేటీఆర్

రిపోర్టర్: విజయ్ స్థలం: వరంగల్

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి దుస్థితిని, పెచ్చులూడుతున్న పైకప్పులను ప్రశ్నిస్తే మాజీ చీఫ్ విప్‌పై పోలీసులు పాశవికంగా దాడి చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.