ఎన్నికల సిబ్బందికి తీపి కబురు: పారితోషికాలు, ప్రమాద పరిహారం పెంపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు మరియు సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త తెలిపిందని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వెల్లడించారు. విధుల్లో పనిచేసే సిబ్బందికి అందజేసే పారితోషికంతో పాటు ప్రమాదాల సమయంలో చెల్లించే పరిహారాన్ని కూడా భారీగా సవరిస్తూ ప్రభుత్వం తరఫున ప్రత్యేక జీవోలు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరనుంది.