గుంతలమయమైన పల్లిపాడు రహదారిపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణికుల నరకయాతన
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జిల్లా పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా పెద్ద గుంతల కారణంగా వాహనాలు దెబ్బతింటున్నాయి. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రయాణిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టి, స్థానిక ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.