డబ్ల్యూడబ్ల్యూఈ రెస్లర్ రోమన్ రెయిన్స్పై ప్రశంసల జల్లు కురిపించిన పెంటా

రిపోర్టర్: కృష్ణ స్థలం: Mexico City

డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రెస్లర్ రోమన్ రెయిన్స్తో జరిగిన మ్యాచ్ తన కెరీర్కే ఒక పెద్ద మలుపు అని స్టార్ రెస్లర్ పెంటా వెల్లడించారు. మెక్సికో సిటీలో జరిగిన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ పోరు తన జీవితంలోనే అత్యంత ఇష్టమైన మ్యాచ్ అని ఆయన పేర్కొన్నారు. రెయిన్స్తో తలపడిన తర్వాతే పెద్ద రెస్లర్ల శైలి ఏమిటో తనకు స్పష్టంగా అర్థమైందని, ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పెంటా ఆనందం వ్యక్తం చేశారు.