ఏపీ విద్యావ్యవస్థకు సింగపూర్ సహకారం అందిస్తుందని మంత్రి షణ్ముగం హామీ
రిపోర్టర్: వెంకట్
స్థలం: తిరుమల
ఏపీ విద్యావ్యవస్థకు పూర్తి సహకారం అందిస్తామని సింగపూర్ హోంమంత్రి కె.షణ్ముగం హామీ ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఇద్దరు మంత్రులు భేటీ అయ్యారు. మాదకద్రవ్యాల రహిత ఏపీ నిర్మాణం కోసం సింగపూర్ విధానాన్ని అనుసరించాలని షణ్ముగం సూచించారు. ఐటీఐలను సింగపూర్ సంస్థతో అనుసంధానించడం ద్వారా యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ అందించేందుకు ఇరువర్గాలు నిర్ణయించాయి. రాష్ట్రంలో విద్యారంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.