జాతీయ స్థాయికి పూడిపర్తి ఉపాధ్యాయురాలి ప్రాజెక్ట్: ఎన్సీఈఆర్టీకి ఎంపిక

రిపోర్టర్: సురేష్ స్థలం: నెల్లూరు

వెంకటాచలం మండలం పూడిపర్తి ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తాళ్ల కరుణశ్రీ రూపొందించిన వినూత్న ప్రాజెక్ట్ జాతీయ స్థాయికి ఎంపికైందని అధికారులు తెలిపారు. విద్యలో నవాచార పద్ధతులు, ప్రయోగాల ప్రోత్సాహం కార్యక్రమం కింద ఈ ప్రాజెక్ట్ను ఎన్సీఈఆర్టీ ఎంపిక చేసిందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి మొత్తం అయిదు ప్రాజెక్టులు ఎంపిక కాగా, జిల్లా నుంచి ఇదే కావడం విశేషమని వెల్లడించారు. సంప్రదాయ బోధనకు సృజనాత్మకతను జోడించి విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఆమె వివరించారు.