రాజాపేటలో స్మార్ట్ రేషన్ కార్డులు: అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసిన సర్పంచ్
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో శుక్రవారం నాడు అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ ఇంజ లక్ష్మీ ఘనంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఈ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.