కుమార్తె అంజలి రెడ్డి వివాహ తేదీలను ప్రకటించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఇడుపులపాయ
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ వేడుకకు సంబంధించిన వివరాలను ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం ఈ నెల 24న జరగనుండగా, వివాహం నవంబర్ 25న, రిసెప్షన్ వేడుక డిసెంబర్ 5న నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ శుభకార్యానికి సంబంధించి తొలి వివాహ ఆహ్వాన పత్రికను ఇడుపులపాయలోని తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు షర్మిల తెలిపారు.