సరిగమప ప్రత్యేక ఎపిసోడ్: సినిమాలో పాడే ముగ్గురు కంటెస్టెంట్స్ను ఎంపిక చేయనున్న అనిల్ రావిపూడి

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ రియాలిటీ షో సరిగమప ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి తన కొత్త చిత్రంలో పాడేందుకు ముగ్గురు కంటెస్టెంట్స్ను ఎంపిక చేయనున్నట్లు జీ తెలుగు నిర్వహకులు తెలిపారు. ఈ ఆదివారం ప్రసారమయ్యే ప్రత్యేక ఎపిసోడ్లో సంగీత ప్రియులను అలరించేందుకు అద్భుతమైన ప్రదర్శనలు సిద్ధమయ్యాయి. అనంత శ్రీరామ్, ఎస్పీ శైలజ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తుండగా, యాంకర్ సుధీర్ హోస్ట్గా ఈ కార్యక్రమం కొనసాగుతోందని నిర్వాహకులు వెల్లడించారు.