కేంద్ర హోంశాఖ గ్రంథంలో శ్రీశైల మహాక్షేత్ర విశేషాలు: పోతుగుంట రమేష్ నాయుడు
రిపోర్టర్: సురేష్
స్థలం: శ్రీశైలం
కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ ప్రచురించిన ప్రత్యేక గ్రంథంలో శ్రీశైల మహాక్షేత్రం విశేషాలు ప్రచురితమైనట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు వెల్లడించారు. నవీముంబైలో జరిగిన అఖిల భారత ఆరవ భాషా సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారని తెలిపారు. శ్రీశైల క్షేత్ర చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు, భౌగోళిక స్వరూపం వంటి అనేక ముఖ్యమైన అంశాలను ఈ ప్రత్యేక వ్యాసంలో పొందుపరిచామని ఆయన పేర్కొన్నారు.